కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వీఎస్సార్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. టాస్క్ సౌజన్యంతో మహింద్ర ప్రైడ్ క్లాస్‌రూమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అలరించిన విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టాస్క్ సౌజన్యంతో మహింద్రప్రైడ్ క్లాస్‌రూమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణలో చివరి రోజు విద్యార్థులు చేసిన సాంప్రదాయ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
అలరించిన విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు
ఈ శిక్షణలో చివరి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయాలను విద్యార్థులు వివరిస్తూ.. సాంస్కృతిక ప్రదర్శలు చేశారు. వీటిని కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్య షమిత, ప్రిన్సిపల్ శంకర్, టాస్క్ ప్రతినిధి శివప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల విద్యార్థులు, పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ