దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా... ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పాఠశాల, వసతి గృహాల ఫీజులను తగ్గించాలని గత 23 రోజులుగా విద్యార్థులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ విధించి విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, విద్యార్థినులను మగ పోలీసులచే కొట్టించడం సిగ్గుచేటని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి సంఘాలు - దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా కరీంనగర్లో ర్యాలీ
దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా... కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి సంఘాలు