వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా కరీంనగర్లో క్రీడా ప్రాధికార సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఎండాకాలం పూర్తై పాఠశాలలు ప్రారంభమైనందున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. 40 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో విద్యార్థులు ఎన్నో క్రీడలు నేర్చుకోవడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్లో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం - విద్యార్థులు
ఎండాకాలంలో సమయం వృథా చేయకుండా వేసవి శిక్షణా శిబిరాలకు హాజరై ఎన్నో క్రీడలు నేర్చుకున్నారు చాలా మంది విద్యార్థులు.
కరీంనగర్లో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం