తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి' - సేయింట్​ జార్జ

కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. విద్యార్థి వైష్ణవి మృతి సంఘటనలో... పాఠశాలపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.

కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి

By

Published : Aug 21, 2019, 11:41 PM IST

కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని వైష్ణవి మృతి ఘటనపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాలిక ఉదయం మృతి చెందిన ఆస్పత్రికి స్కూలు యాజమాన్యం రాకపోవడంపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్​పై చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రి శవగారం ముందు నిరసన తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేయడానికి వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న డీఈఓను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులపై డీఈఓ ఆగ్రహానికి గురయ్యారు. వినతి పత్రం తీసుకోకుండా వెళ్తున్న అధికారికి పోలీసులు నచ్చజెప్పారు. విద్యాశాఖ అధికారి మాట్లాడుతున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details