కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టైగర్ పంచ్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. స్థానిక ప్రతాప సాయి గార్డెన్‌లో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పోటీలల్లో పాల్గొనేందుకు వచ్చారు. మూడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల సందడి - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టైగర్ పంచ్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల సందడి
కటాస్, స్పారింగ్ అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు పతకాలను అందించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు హాజరైనట్లు టైగర్ పంచ్ కరాటే క్లబ్ అధ్యక్షులు బూసారపు బాపురావు వెల్లడించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.