హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ (huzurabad by elections 2021)కేంద్రాలను కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. వీణవంకలోని కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్... పోలింగ్ సరళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ కర్ణన్ హెచ్చరించారు.హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections 2021) వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఓటర్లు ఉదయం నుంచే కొవిడ్ నిబంధనలు(covid news) పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అనగా ఉదయం 9 గంటల వరకు దాదాపుగా 10.5 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. తొలుత ఆరు పోలింగ్ కేంద్రాల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. సిబ్బంది వాటిని వెంటనే రెక్టిఫై చేశారు. ఏ ప్రాంతంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 7 గంటల్లోపు వచ్చిన వారందరికీ ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను. వంద మీటర్లలోపు ఎవరూ ప్రచారం చేయకూడదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. పోలింగ్ సరళిపై సీపీ సమీక్షిస్తున్నారు.
-ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్