కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట్ గ్రామములో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు రేణుకా మాత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముత్యంపేటలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ - కామారెడ్డి జిల్లా ముత్యంపేటలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి జిల్లా ముత్యంపేటలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
![ముత్యంపేటలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ gampa goverdhan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5590504-947-5590504-1578123663992.jpg)
ముత్యంపేటలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
పాపన్న గొప్ప ఉద్యమ కారుడని, ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసిన వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గంప గోవర్ధన్ గుర్తు చేశారు. గీత కార్మికుల పైన విధించే మోతుగర్భ పన్నుకు మరియు కల్లు తాగి పైకం చెల్లించకుండా ఏగనామం పెట్టే మొగల్ రాజ్య తొత్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాడన్నారు. మొగల్ సైన్యాన్ని ఓడించి జనగాం వంటి కోటలను గెలుపొందారని పేర్కొన్నారు. చరిత్ర విస్మరించిన గొప్ప తెలంగాణ ఉద్యమ కారుడని పాపన్నను ప్రశంసించారు గంప గోవర్ధన్.
ముత్యంపేటలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
ఇవీ చూడండి: తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి సమావేశం