యువ రచయితలను ప్రోత్సహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. కరీంనగర్లో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన రాష్ట్రస్థాయి కథా రచన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. యువతలో రచనలను ప్రోత్సహించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నూతన రచయితలతో పాటు విద్యార్థులు కార్యశాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రచనలు కండ్లకు అద్దినట్టు ఉండాలని నూతన రచయితలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంపశయ్య నవీన్‌తో పాటు ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, తెరవే జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, రామాచంద్రమౌళి, గాజోజు నాగభూషణం పాల్గొన్నారు. రచనలు అందరికి అర్థమయ్యే రీతిలో ఉండాలని అల్లం రాజయ్య తెలిపారు.
యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్ - యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్
కరీంనగర్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కథారచన కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, అల్లం రాజయ్య పాల్గొన్నారు. యువ రచయితలను ప్రోత్సహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య అన్నారు.
యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్