కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో... వర్షాల వల్ల నష్టపోయిన పంటలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పరిశీలించారు. కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలైందని అన్నదాతలు వాపోయారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సర్వే చేపట్టాలని మేడిపల్లి సత్యం కోరారు.
'పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి' - తెలంగాణలో భారీ వర్షాలు
రామడుగు మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పర్యటించారు. భారీ వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించారు.

'పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలని కోరారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.