కుటుంబ బాధ్యత ఎక్కువగా మహిళలకే ఉంటుందని, అందుకే రాష్ట్రప్రభుత్వం తరుపున వారికి ప్రత్యేక రుణాలు అందిస్తున్నామని... బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కరీంనగర్‌లో సహారా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మేయర్ సునీల్‌రావుతో కలిసి సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు.
సహారా సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. 4 సంవత్సరాలుగా ఎటువంటి లాభం ఆశించకుండా సంస్థ నిర్వాహకురాలు అస్మా... శిక్షణతో పాటు కుట్టు మిషన్‌లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆమె తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు.