శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్య సేవలు నయనానందకరంగా కరీంనగర్లో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని చంద్రప్రభ వాహనంపై మాఢవీధుల్లో భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు. ఈ వాహన సేవలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. గర్భాలయంలో శ్రీవారు శ్రీ కృష్ణావతారంలో దర్శనమిచ్చారు.
నయనానందకరంగా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు - కరీంనగర్ తాజా వార్త
కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య కైంకర్య సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోవిందుడిని చంద్రప్రభ వాహనంపై మాఢవీధుల్లో భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు.
![నయనానందకరంగా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు sri venkateswara vahana seva in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5891355-340-5891355-1580354137101.jpg)
నయనానందకరంగా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కరీంనగర్ ఆధ్యాత్మికతకు ఆప్యాయతలకు కొలువు అని ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత అన్నారు. భక్తి సంగీత విభావరి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె స్వామి వారి గీతాలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలు పాడి భక్తులను పరవశించేలా చేశారు. శ్రీవారిని దర్శించి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నయనానందకరంగా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు