ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని... కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఆయన పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ పోటీలలో గెలుపొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
'ఉద్యోగులు దృఢంగా ఉండేందుకే క్రీడా పోటీలు' - karimnagar district latest news
ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని... కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. కొవిడ్ సమయంలో జిల్లా ప్రజలకు నగరపాలక సిబ్బంది అందించిన సేవలను కొనియాడారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండేందుకే క్రీడా పోటీలు
పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి పరిచయం చేసుకున్నారు. నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది ఈ పోటీల ద్వారా ఒకరినొకరు తెలుసుకోవచ్చని కమిషనర్ క్రాంతి అన్నారు. ఇదే స్నేహాన్ని విధుల్లో కొనసాగిస్తూ కలిసిమెలిసి పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. కొవిడ్ సమయంలో జిల్లా ప్రజలకు నగరపాలక సిబ్బంది అందించిన సేవలను మేయర్ కొనియాడారు.
ఇదీ చదవండి: సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం