తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్ జిల్లాలో ఆక్సిజన్‌, బెడ్స్, ఇంజక్షన్లపై ప్రత్యేక నిఘా - telangana news today

లైఫ్ సేవ్‌ డ్రగ్‌గా భావించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను నల్లబజారుకు తరలించకుండా కరీంనగర్‌ కలెక్టర్‌ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెమ్​డెసివిర్ ఇంజక్షన్లతోపాటు కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్‌, బెడ్స్‌పై నిరంతర తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన బృందం... ఎలా తనిఖీలు నిర్వహించనుందో బృందానికి నాయకత్వం వహిస్తున్న ఔషధ నియంత్రణ అధికారి కిరణ్‌ కుమార్​తో​ ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.

karimnagar news today, drug inspector kiran kumar
ఆ జిల్లాలో ఆక్సిజన్‌, బెడ్స్, ఇంజక్షన్లపై ప్రత్యేక నిఘా

By

Published : Apr 24, 2021, 7:48 PM IST

కరీంనగర్​ జిల్లాలో కొవిడ్‌ చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో సదుపాయాలతోపాటు ఔషధాల వినియోగంపై తనిఖీ చేసి కలెక్టర్‌కు రోజూ నివేదిక ఇస్తున్నామని డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ కిరణ్​ కుమార్​ తెలిపారు. బెడ్స్​ కొరత, కొవిడ్​ ఇంజక్షన్లు, ఆక్సిజన్​ సహా ఇతర సౌకర్యలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రెమ్​ డెసివిర్ ఇంజక్షన్లు తీసుకన్న వారి వివరాలు సేకరించి.. వారికి ఫోన్​ చేసి ఇంజక్షన్​ తీసుకున్నారో లేదో తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మిగతా రెమ్​ డెసివిర్ ఇంజక్షన్ల వివరాలను రోజూ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రోజు వివరాలు ఆ రోజు సేకరించడం ద్వారా కరోనా రోగులకు సులభంగా సౌకర్యాలు అందుతున్నాయని ఆయన వివరించారు.

ఆ జిల్లాలో ఆక్సిజన్‌, బెడ్స్, ఇంజక్షన్లపై ప్రత్యేక నిఘా

ఇదీ చూడండి :హైదరాబాద్​ పరిధిలో లక్ష మందికి ఫైన్​: సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details