ఆధ్యాత్మిక క్షేత్రాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన క్షేత్రాలతో పాటు ఆయా జిల్లాల్లో పురాతన ఆలయాలు పర్యాటకులకు దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి.
నిండుకుండలా జలాశయాలు
ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి ఎగువ మానేరు, మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. సబ్బితం, రాయికల్ జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. సింగసముద్రం మత్తడి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటీ పడుడుతున్నారు. కొవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఈ జలాశయాలను వీక్షించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు.
పర్యాటక హబ్‌గా కరీంనగర్
ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ పర్యాటక రంగానికి హబ్‌గా మారింది. దిగువ మానేరు అందాలతో పాటు ఉజ్వల పార్కు, జింకల పార్కు, కొత్తగా తీగెల వంతెనతో పాటు చారిత్రక కట్టడం ఎలగందుల లాంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వం పార్కులు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.. ఉజ్వల పార్కు, జింకల పార్కు శనివారం తెరచుకున్నాయి. దిగువ మానేరు జలాశయం, కోటి లింగాల దేవాలయం సమీపంలో బోటింగ్ సౌకర్యం అలరిస్తోంది.
ఇదీ చదవండి :దుర్గం చెరువు బ్రిడ్జిపై సింఫోనీ బ్యాండ్..