తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధిత విద్యుత్తు సిబ్బందికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌

కరీంనగర్ జిల్లా.. కరోనా నేపథ్యంలో వైద్య బృందాలు శనివారం 722 గృహాలను సందర్శించి 2,917 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా బాధిత విద్యుత్తు సిబ్బందికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌
కరోనా బాధిత విద్యుత్తు సిబ్బందికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌

By

Published : Aug 2, 2020, 5:29 PM IST

కరోనా వైరస్‌ బారిన పడిన విద్యుత్తు సిబ్బందికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్తు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినా 0870-2461030కు సంప్రదించాలన్నారు.

కంట్రోల్‌ రూంలో మెడికల్‌ కమిటీ 24గంటల పాటు పనిచేస్తుందని వివరించారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని సూపరింటెండెంట్‌ ఇంజినీర్లు, డీఈ(టెక్నికల్‌)లకు కోవిడ్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్య బాధ్యతతమదేనన్నారు. ఉద్యోగులు, సంఘాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

2,917 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు...

కరీంనగర్ జిల్లా.. కరోనా నేపథ్యంలో వైద్య బృందాలు శనివారం 722 గృహాలను సందర్శించి 2,917 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. హుజూరాబాద్‌లో 1,833 మందికి, చెల్పూరు పీహెచ్‌సీ పరిధిలో 1,084 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వైరస్‌ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details