ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramadan Special: రంజాన్‌ మాసంలో నోరూరిస్తున్న మసాలా రుచులు - ts news

Ramadan Special: భగభగమండే భట్టీలు.. గరం గరం హలీమ్‌.. నోరూరించే చికెన్‌ కబాబ్‌.. తియ్యని ఖీర్‌, 'ఖుర్బానీ కా మీఠ్‌' రుచులు. రంజాన్ మాసం వచ్చిందంటే.. విభిన్న వంటకాలు నగరాల్లో దర్శనమిస్తాయి. మసాలా వాసనలు గుమ్మని వెదజల్లుతూ.. రోడ్డుపై వెళ్తున్న భోజనప్రియుల్ని ఆకర్షిస్తాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు దూరమైన రంజాన్‌ రుచుల కోసం.. ఆహార ప్రియులు రెస్టారెంట్లకు వరుస కడుతున్నారు.

Ramadan Special: రంజాన్‌ మాసంలో నోరూరిస్తున్న మసాలా రుచులు
Ramadan Special: రంజాన్‌ మాసంలో నోరూరిస్తున్న మసాలా రుచులు
author img

By

Published : Apr 22, 2022, 10:04 PM IST

రంజాన్‌ మాసంలో నోరూరిస్తున్న మసాలా రుచులు

Ramadan Special: రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు.. ముస్లింల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతోపాటు.. హైదరాబాద్‌ సంప్రదాయ వంటకం హలీమ్‌ గుర్తుకొస్తుంది. రోడ్డు పక్కనే ఉన్న రెస్టారెంట్లలో విభిన్న రకాల మసాలా రుచులు దర్శనమిస్తాయి. ఒకప్పుడు కేవలం భాగ్యనగరానికే పరిమితమైన హలీమ్‌... ఇప్పుడు ప్రధాన ప్రాంతాలకు విస్తరించింది. కరీంనగర్‌లోనూ రంజాన్‌ రుచులు నగరవాసుల మనసు దోచుకుంటున్నాయి. చికెన్ కబాబ్, పాయా రోటీ, డబుల్ కా మీఠా, ఖుర్బానీ కా మీఠా, ధమ్‌ కీ బిర్యానీ, మలై కబాబ్, చికెన్ 65, ఖీర్, మటన్ బిర్యానీ లాంటి.. అనేక వెరైటీలు ఇక్కడ తయారవుతున్నాయి.

హలీమ్​ తయారీ అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఇది తయారు చేయాలంటే ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 5గంటల వరకు అవుతుంది. ప్రతి రోజు కొత్త మసాలాలు తీసుకొచ్చి గ్రైండ్​ చేయాలి. దాదాపు 25 రకాల మసాలాలను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. తర్వాత చికెన్​, మటన్​లను తీసుకొని వేర్వేరు పాత్రల్లో వేసి మసాలాలు వేసుకుంటూ 3 గంటల పాటు హలీమ్​ బట్టిపై వేడి చేయాలి. ఇది తయారు చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్​ నుంచే వస్తాద్​లు ఇక్కడికి వస్తారు. -అఫ్జల్​, హలీమ్​ కేంద్రం నిర్వాహకులు

రా రమ్మంటోన్న హలీమ్​ రుచులు: కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు హలీమ్‌ రుచులకు దూరమైన ఆహారప్రియులు.. ఇప్పుడు ఆ ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదించేందుకు బారులు తీరుతున్నారు. భోజన ప్రియులతో హలీమ్‌ భట్టీలు కిటకిటలాడుతున్నాయి. కొవిడ్‌ రెండేళ్లుగా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని.. ఈసారి మాత్రం గిరాకీ బాగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. నెలపాటు కొనసాగే రంజాన్‌ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్.. కరీంనగర్‌లో భోజన ప్రియులను రా.. రమ్మంటోంది.

రెగ్యులర్​గా ప్రతి సంవత్సరం హలీమ్​ తినడానికే ఇక్కడికి వస్తుంటా. కేవలం ఎట్టి పరిస్థితుల్లో చికెన్​, మటన్​ హలీమ్​ తినడానికి వస్తుంటాం. గత రెండు సంవత్సరాల్లో కొవిడ్​ వల్ల ఇటువైపు రాలేదు. ఈ సంవత్సరం హలీమ్​ రుచి చూడడానికి ప్రతిరోజు వస్తున్నాం. -ఆహార ప్రియుడు


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details