కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌గా తేలటం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. నగరపాలక సిబ్బంది ద్వారా పారిశుద్ధ్య పనులు చేయిస్తుండగా... మరోవైపు వైరస్ వ్యాప్తి చెందకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం చల్లే బాధ్యతను అగ్నిమాపక సిబ్బందికి అప్పగించారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా 30ప్రాంతాల్లో ద్రావణం చల్లామని.. ఈ ప్రక్రియ కొనసాగుతుందంటున్న జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కరోనాను నియంత్రించేంత వరకు కొనసాగిస్తాం - Sodium Hypochlorite Spray
కరీంనగర్‌లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణాన్ని పిచికారి చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేలా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరోనాను నియంత్రించేంత వరకు కొనసాగిస్తాం
TAGGED:
Sodium Hypochlorite Spray