కరీంనగర్ ఎస్ఆర్‌ఆర్ కళాశాల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ను బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. జనాభాకు అనుగుణంగా సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని చెప్పారు. నగరానికి వివిధ పనులపై ప్రజలు పెద్దెత్తున వస్తుంటారని.. వారికి అవసరమైన సులభ్ కాంప్లెక్స్‌లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
జనాభాకు అనుగుణంగా సులభ్ కాంప్లెక్స్‌లు: గంగుల - కరీంనగర్ జిల్లా వార్తలు
జనాభాకు అనుగుణంగా సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ఎస్ఆర్‌ఆర్ కళాశాల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ను మేయర్ సునీల్‌రావు,కమిషనర్ క్రాంతితో కలిసి ప్రారంభించారు.
![జనాభాకు అనుగుణంగా సులభ్ కాంప్లెక్స్‌లు: గంగుల social welfare minister gangula kamalakar inaugurated sulab complex in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7572484-thumbnail-3x2-minister.jpg)
జనాభాకు అనుగుణంగా సులభ్ కాంప్లెక్స్‌లు: గంగుల
నగరంలో మొత్తం 40 కాంప్లెక్సులు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగగ్వామ్యంతో నిర్మించే టాయిలెట్లలో రుసుము వసూలు చేస్తుంటారని.. నగరంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉచిత సుదపాయం కూడా కల్పిస్తామన్నారు. ముఖ్యంగా షీటాయిలెట్స్ లేకపోవడం వల్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!