కరీంనగర్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సీసీ కెమెరాలను కోటి రూపాయలతో కొనుగోలు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. నగరపాలక కార్యాయంలో సీపీ కమలాసన్‌రెడ్డికి సీసీ కెమెరాలతోపాటు అవసరమైన సామగ్రిని అందజేశారు. సీఎం అష్యూరెన్స్ నిధుల్లో నుంచి ఈ డబ్బు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
కోటి రూపాయలతో సీసీ కెమెరాల కొనుగోలు - social welfare minister gangula kamalakar latest news
శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తూ కరీంనగర్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సీసీ కెమెరాలను కోటి రూపాయలతో కొనుగోలు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరపాలక కార్యాయంలో సీపీ కమలాసన్‌రెడ్డికి సీసీ కెమెరాలతోపాటు అవసరమైన సామగ్రిని అందజేశారు.
శాంతిభద్రతలను నిరంతరం కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి నుంచి చెబుతున్నారని తెలిపారు. నగరంలో ఎప్పుడు ఏది జరిగినా క్షణాల్లో పోలీసులకు చేరే విధంగా సీసీ కెమెరాలు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో సురక్షిత, ఆదర్శ నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు గంగుల కమలాకర్ వివరించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.
ఇదీ చూడండి:డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం