కరోనా భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. చివరికి అంతిమయాత్రలో ఆత్మీయులే సామాజిక దూరం పాటించేలా చేసింది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చెట్ల మురళి గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి కేటీఆర్ చొరవతో మృతుని చిన్న కుమారుడు బెంగళూరు నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేందుకు బంధువులు పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. వచ్చిన వారంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పాల్గొన్నారు.