భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పెద్ద చెరువులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. వర్షాలు, వరదల వల్ల పుట్టల్లోకి నీరు చేరి పాములు బయటకొస్తున్నాయి. ప్రవాహంలో కొట్టుకొచ్చిన పాములు గుంపుగా చేరుతున్నాయి. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో గుంపుగా ఉన్న పాములను చూసి స్థానికులు భయాందోళనకు గురవతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరిన సమయంలో పాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
snakes: కుప్పలు తెప్పలుగా పాములు.. ఎక్కడ..? ఎందుకొచ్చాయి?
భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో పాముల పుట్టలు మునిగిపోవడం వల్ల... ఆవాసాలను వెతుక్కుంటూ పాములు నివాసప్రాంతాల్లోకి వస్తున్నాయి. పాములను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
snakes
Last Updated : Sep 8, 2021, 12:15 PM IST