కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఏర్పాటు చేసిన తెరాస(trs) ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం రసాభాసగా సాగింది. జై ఈటల అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) అనుచరులు నినాదాలు చేశారు. కొందరు నాయకులు ఈటల వర్గీయులను వారించే ప్రయత్నం చేశారు.
trs: కార్యకర్తల సమావేశంలో ఈటల వర్గీయుల ఆందోళన - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది. మాజీ మంత్రి ఈటల అనుచరులు ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈటల అనుచరుల ఆందోళన, వీణవంక మండల తెరాస సమావేశం
ఇరు వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ(mlc) నారదాసు లక్ష్మణ్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు.
ఇదీ చదవండి:'కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'