కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామాన్ని సందర్శించారు. నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రూ.83 లక్షలతో నిర్మించిన సింగిల్‌విండో భవనం, గోదాంలను మంత్రి ఈటలతో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయలు కలిసి ప్రారంభించారు. భవనాన్ని పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సింగిల్‌విండో భవనం, గోదాంలను ప్రారంభించిన మంత్రి ఈటల - కరీంనగర్ వార్తలు
హుజూరాబాద్ నియోజవర్గంలోని తనుగుల గ్రామాన్ని మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. రూ.83లక్షలతో నిర్మించిన సింగిల్ విండో భవనం, గోదాంలను మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు.

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఛైర్మన్ బాలకిషన్‌రావుతో పాటు ఇతర పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో సాగునీరు, విద్యుత్ కోసం నానా ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నీ సాధించుకున్నామన్నారు. అనంతరం మంత్రిని నూతన పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు