తెలంగాణ

telangana

ETV Bharat / state

దూసుకుపోతున్న సింగరేణి.. ఆల్​టైం రికార్డు ఇదే.!

Singareni Coal Products Creating Records: సింగరేణి బొగ్గు సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ఆల్​ టైం రికార్డును సృష్టించింది. జనవరి నెలలో 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. తన పేరిటే ఉన్న పాత రికార్డును తుడిచి పెట్టేసింది.

singareni
సింగరేణి

By

Published : Feb 1, 2023, 3:20 PM IST

Updated : Feb 1, 2023, 3:30 PM IST

Singareni Company Record: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ‌లో ప‌లు రికార్డుల‌ను నమోదు చేస్తుంది. జ‌న‌వ‌రి నెల‌లో 68.4 ల‌క్షల ట‌న్నుల బొగ్గును ర‌వాణా చేసి సింగ‌రేణి చ‌రిత్రలోనే ఆల్ టైం రికార్డు నమోదు చేసిందని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. గ‌తంలో 2016 సంవ‌త్సరం మార్చి నెల‌లో చేసిన 64.7 ల‌క్షల ట‌న్నుల బొగ్గు ర‌వాణా సింగరేణి పేరిట ఇప్పటి వ‌ర‌కు గ‌రిష్ఠ రికార్డుగా నమోదై ఉంది. దాన్ని ఈ ఏడాది జనవరి నెలలో అధిగమించినట్లు యాజమాన్యం వెల్లడించింది.

జ‌న‌వరి నెల‌లో మొత్తం 11 ఏరియాల నుంచి స‌గ‌టున రోజుకు 39 రైలు బండ్లతో మొత్తం 1,216 రేకులతో బొగ్గు ర‌వాణా చేశారు. తెలంగాణ జెన్ కోతో పాటు, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని థ‌ర్మల్ విద్యుత్ కేంద్రాల‌కు ఎక్కువ శాతం బొగ్గు ర‌వాణా చేశారు. బొగ్గు ర‌వాణాతో పాటు ఓపెన్ కాస్ట్ గ‌నుల్లో ఓవ‌ర్ బ‌ర్డెన్ తొల‌గింపులో కూడా సింగ‌రేణి కొత్త రికార్డు సాధించింది. కంపెనీ చ‌రిత్రలో తొలిసారిగా జనవరి 31వ తేదీన ఉద‌యం షిఫ్టు నుంచి రాత్రి షిఫ్టు వ‌ర‌కు అత్యధికంగా 16.67 ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల ఓవ‌ర్ బ‌ర్డెన్​ను తొల‌గించి సింగరేణి సంస్థ రికార్డు సృష్టించింది.

గ‌త నెల‌ జనవరి 30వ తేదీన సాధించిన‌ 15.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ ఇప్పటి వ‌ర‌కు గ‌రిష్ఠ రికార్డుగా ఉందని.. దాన్ని 31వ తేదీతో అధిగమించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే దానిపై ఉన్న మట్టిని తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ యంత్రాలతోపాటు ఆఫ్ లోడింగ్ యంత్రాల సహాయంతో ఓబీని తొలగిస్తుంటారు. జనవరి 31న ఆఫ్ లోడింగ్ ద్వారా 14.83 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్​ను, డిపార్ట్​మెంటల్ యంత్రాల సహాయంతో 1.84 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించడంతో ఈ కొత్త రికార్డు నెల‌కొల్పినట్లు రైల్వేశాఖ తెలిపింది.

సింగరేణి ఆల్​టైం రికార్డు: తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థ గడిచిన ఏడేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాల్లో తన చరిత్రలోనే ఆల్‌ టైం రికార్డుగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. దేశంలోని 8 మహారత్న కంపెనీలు సాధించిన దానికన్నా ఎంతో ఎక్కువ సాధించింది. లాభాల్లో వృద్ధిని పరిశీలిస్తే మహరత్న కంపెనీల్లో అగ్రగామి సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ గడచిన ఐదేళ్లలో 104.5 శాతం వృద్ధిని సాధించగా.. సింగరేణి 281.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 1, 2023, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details