తెలంగాణ

telangana

ETV Bharat / state

అరెస్టయిన కార్మికులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు - అరెస్టయిన కరీంనగర్ కార్మికులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కరీంనగర్​ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కార్మికులను అరెస్ట్ చేయగా... అందులో కొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అరెస్టయిన కార్మికులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
అరెస్టయిన కార్మికులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

By

Published : Nov 26, 2019, 10:21 AM IST

కరీంనగర్‌‌ జిల్లా కేంద్రంలో సమ్మెను విరమించి విధుల్లోకి చేరడానికి వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం 4 గంటల నుంచే బస్టాండ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు తాత్కాలిక ఉద్యోగులతో బస్సు సర్వీసులను యథావిధిగా నడిపించారు.

తమ ఉద్యోగాలు తమకి కావాలంటూ పప్లకార్డులు చేతపట్టుకొని నిరసన తెలుపుతూ డిపో ప్రాంగణంలోకి వచ్చారు కార్మికులు. పోలీసులు వారిని డిపోలోకి వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని అందువల్లే వెళ్లనివ్వట్లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

పలువురు కార్మికులను అదుపులోకి తీసుకొని వ్యాన్‌లోకి ఎక్కించగా ఆ వ్యాన్లను మహిళా ఉద్యోగులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అదుపులోకి తీసుకున్న క్రమంలో పలువురు అస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అరెస్టయిన కార్మికులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఇవీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details