దేశ సమగ్రత కోసం పాటుపడిన మహోన్నతుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. కరీంనగర్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌బూత్‌లో పది మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి: సంజయ్ - కరీంనగర్ జిల్లా వార్తలు
జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని కరీంనగర్లో జరిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ సమగ్రత కోసం నిరంతరం కృషి చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో భాజపా కార్యకర్తలు ముందుకెళ్లాలని సూచించారు.
'శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రతి కార్యకర్తకు స్పూర్తిదాత'
కశ్మీర్ భారత్ దేశంలో అంతర్భాగమని.. ఏక్ దేశ్‌మే దో నిశాన్, దోప్రధాన్, దోవిధాన్ ఎందుకు అన్న నినాదంతో చేసిన పోరాటం ఫలించిందని బండి సంజయ్ చెప్పారు. ముఖర్జీ ఆశయం మేరకు భాజపా ప్రభుత్వం కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేసిందని గుర్తు చేశారు.