తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వారీ నీటి గుంతలో పశువుల కాపరి మృతదేహం - latest news of shepherd dead in karimnagar

కరీంనగర్​ జిల్లా ఆచంపేట గ్రామంలో పశువులను మేపుకుని సాయంకాలానికి తిరిగి వస్తారని భావించిన కుటుంబ పెద్ద ఎంతకీ తిరిగి రాలేదు. మరుసటి రోజు బండరాళ్ల క్వారీలోని నీటి గుంతలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

క్వారీ నీటి గుంతలో పశువుల కాపరి మృతదేహం

By

Published : Nov 10, 2019, 8:13 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపేట గ్రామంలోని మొగిలి కనకయ్య (40) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పశువులను మేపేందుకు వెళ్లిన కనకయ్య బండరాళ్ల క్వారీలోని నీటి గుంతలో పడి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు.


ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు చూడక పోవటం వల్ల అతను మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్వారీ కోసం తీసిన అండర్ గ్రౌండ్ నీటి గుంట పక్కన కనకయ్యకు చెందిన టిఫిన్ బాక్స్, చెప్పులు ఉండటంతో నీటిలో వెతికారు.


ఆరుగంటల పాటు శ్రమించిన రెస్క్యూ బృందం నీటిగుంత అడుగు నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. సాయంత్రానికి తిరిగి వస్తారనుకున్న కుటుంబ పెద్ద శవమై రావడం తట్టుకోలేని కనకయ్య కుటుంబం గుండెలవిసేలా రోదిస్తున్నారు.

క్వారీ నీటి గుంతలో పశువుల కాపరి మృతదేహం

ఇదీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details