తెలంగాణ

telangana

ETV Bharat / state

శాతవాహన విశ్వవిద్యాలయం విద్యార్థుల రాస్తారోకో - శాతవాహన విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళన

కరీంనగర్​ పట్టణంలోని శాతవాహన విశ్వవిద్యాలయం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్​ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.

shatavahana university
శాతవాహన విశ్వవిద్యాలయం విద్యార్థుల రాస్తారోకో

By

Published : Feb 12, 2020, 7:52 PM IST

కరీంనగర్‌ పట్టణంలోని శాతవాహన విశ్వవిద్యాలయం భూములు ఆక్రమణకు గురవుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాయానికి చెందిన 42 ఎకరాల స్థలంలో ఐటీ టవర్ నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. అక్కడకు సమీపంలోని ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడిందని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నిన్న రాత్రి విశ్వవిద్యాలయ స్థలాన్ని యంత్రాలతో చదును చేస్తుంటే.. పట్టించుకొనే వారులేకుండా పోయారని విద్యార్దులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆందోళనతో ఎన్టీఆర్ కూడలి వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విశ్వవిద్యాలయం భూములు తమకు అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధి సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

శాతవాహన విశ్వవిద్యాలయం విద్యార్థుల రాస్తారోకో

ఇవీచూడండి:వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన ఎస్పీబీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details