సాగు చట్టాల పట్ల నిరసనగా.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్‌లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చట్టాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'సాగు చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలి'
సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ కరీంనగర్‌లో కొనసాగుతోంది. ఆ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్‌ఎఫ్‌ఐ భారత్ బంద్, డీవైఎఫ్‌ఐ భారత్ బంద్
భారత్ బంద్‌లో భాగంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తే.. పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రూ.246 కోట్లతో ఎకో టూరిజం పార్కుల అభివృద్ధి