తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలదు.. ధాన్యాన్ని కొనాలి'

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభిస్తే సరిపోదని.. వాటిని సరిగ్గా పనిచేసేలా చూడాలని తెదేపా కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు  జోజిరెడ్డి ఎద్దేవా చేశారు. చొప్పదండిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడిచినా వాటిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు.

'కేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలదు.. ధాన్యాన్ని కొనాలి'

By

Published : Nov 10, 2019, 7:07 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తూకం మాత్రం మొదలుపెట్టడం లేదని తెదేపా జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి విమర్శించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న నాయకులు 15 రోజులు గడిచినా... నేటి వరకు కొనుగోలు మొదలుపెట్టక పోవడం దారుణమని అన్నారు.

కుర్మపల్లిలోని ఓ రైతు తన ధాన్యాన్ని మిల్లుకు తీసుకువెళ్లగా తేమశాతం అధికంగా ఉందని తిప్పి పంపారని అన్నారు. ఖరీఫ్ సీజన్​లో అతివృష్టితో నష్టపోయిన రైతులకు సహాయం చేయాల్సింది పోయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వెళ్లిన రైతులకు కనీసం సామాగ్రిని అందించడం లేదన్నారు. తేమ 17 శాతం ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతుండగా 13 శాతం వచ్చినా దాన్ని తిప్పి పంపుతున్నారని విమర్శించారు.

కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం మాత్రమే కాదని.. వాటిని సరైన రీతిలో పనిచేసేలా చూడాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సత్వరమే ధాన్యం కొనుగోలును మొదలుపెట్టాలని లేనిపక్షంలో ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు.

'కేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలదు.. ధాన్యాన్ని కొనాలి'

ఇదీ చూడండి: ఆన్నదాత ఆగమాగం.. మార్కెట్​లో దయనీయంగా ధాన్యం!

ABOUT THE AUTHOR

...view details