తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీలు యజమానులయ్యారు.. దళిత బస్తీతో... - అప్పుడు కూలీలు.. ఇప్పుడు యజమానులు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ వ్యవసాయ కూలీ కుటుంబాలు 'దళిత బస్తీ పథకం'తో సొంత వ్యవసాయానికి నడుం బిగించారు.

sc st pfarmers at narayanapur village in karimnagar district are doing agriculture in their own fields
అప్పుడు కూలీలు.. ఇప్పుడు యజమానులు

By

Published : Dec 26, 2019, 12:49 PM IST

అప్పుడు కూలీలు.. ఇప్పుడు యజమానులు

2017లో కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​లో 8మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 21 ఎకరాల 27 గుంటల భూమి పంపిణీ చేసింది. పంటల సాగుకు తగినంత పెట్టుబడి లేకపోవడం వల్ల రెండు సంవత్సరాలుగా లబ్ధిదారులు మరొకరి పొలాల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.

తాజాగా ప్రభుత్వం దళిత బస్తీ పథకంతో 8 మంది లబ్ధిదారులకు 43 వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ పథకంతో ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల్లో వ్యవసాయం చేయడానికి ఎనిమిది కుటుంబాలు ఉపక్రమించాయి.

ప్రభుత్వ చేయూతతో వ్యవసాయ కూలీ పనుల నుంచి సొంత వ్యవసాయం చేసుకునే స్థాయికి ఎదిగామని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details