తెలంగాణ

telangana

పండిన పంటనంతా పంచింది!

By

Published : May 1, 2020, 10:41 AM IST

కష్టపడి పండించిన ఆ పంటని అమ్ముకుంటే తన కుటుంబ అవసరాలకు ఢోకా లేకపోవచ్చు. అదే పంటని పదిమందికీ పంచితే ఊరందరి ఆకలి తీరుతుంది కదా అని ఆలోచించిందా ఊరి సర్పంచి. ఆమే కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామం మొదటి మహిళ శారద..

sarpanch-sharada-helped-to-poor-families-at-karimnagar
పండిన పంటనంతా పంచింది!

మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పట్నుంచి కష్టం, సుఖం తెలిసిన మనిషి కావడం వల్ల ఊరి వాళ్లంతా ఆమెను సర్పంచిగా గెలిపించారు. ఆమె కూడా వాళ్ల ఆశల్ని వమ్ముకానీయ లేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో కూలీనాలీ చేసుకునే కుటుంబాలకు తనవంతు సాయాన్ని అందించాలనుకుంది. 650 కుటుంబాలున్న శాలపల్లి, ఇందిరానగర్‌ గ్రామాల్లోని పేదల ఆకలిని తీర్చాలని భావించింది.

మూడెకరాల్లో పండించిన 150 బస్తాల సన్నరకం ధాన్యాన్ని బియ్యంగా మార్చింది. 53 క్వింటాళ్ల బియ్యాన్ని 25 కిలోల చొప్పున గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు అందించింది. కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు కలిపి మొత్తం 212 కుటుంబాలకు ఉచితంగా పంచింది.

ప్రజలు బాగుంటేనే తాము బాగుంటామనే తీరుని చేతల్లో చూపించిందామె. అంతకుముందే గ్రామస్థులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ రూ.20 వేలను వెచ్చించి మాస్కులను పంపిణీ చేసి ప్రజల మన్ననలను అందుకుంది. పుట్టిన ఊరికోసం ఎంతైనా సేవ చేస్తానంటున్న ఈ సర్పంచి శారద మరెన్నో సేవాకార్యక్రమాలను చేపట్టాలని ఆశిద్దాం..!

ఇదీ చూడండి:స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

ABOUT THE AUTHOR

...view details