కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో రహదారిపై విద్యుత్ స్తంభాలు తొలగించడం లేదని సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న వినూత్న నిరసన తెలిపారు. రహదారిపై ఉన్న ప్రతి స్తంభానికి టెంకాయ కొడుతూ అధికారుల వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా రహదారిపై స్తంభాలను రోడ్లు భవనాల శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తొలగించడం లేదని వాపోయారు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
రోడ్డుపై విద్యుత్ స్తంభాలు తీసేయాలని వినూత్న నిరసన - nirasana
రహదారిపై విద్యుత్ స్తంభాలు తొలగించడం లేదని ప్రతి స్తంభానికి టెంకాయ కొడుతూ గోపాల్రావుపేట సర్పంచ్, ప్రజలు అధికారుల వైఖరిని వినూత్నంగా నిరసించారు.
రోడ్డుపై విద్యుత్ స్తంభాలు తీసేయాలని వినూత్న నిరసన