కరీంనగర్ జిల్లా అర్కండ్లకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ గ్రామ సర్పంచ్ అనిత విద్యార్థులతో కలిసి ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించారు. బస్సు శంకరపట్నం మండలం ఏరడపల్లి వరకే వస్తుందని, తమ గ్రామ విద్యార్థులు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అర్కండ్లకు బస్సును నడిపించకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేదని రోడ్డుపై బైఠాయించారు.
విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా - విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా
బడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడవాలి. విద్యార్థుల కోసం ఆ ఊరి మహిళా సర్పంచ్ రోడ్డుపై బైఠాయించారు. బస్సు సౌకర్యం కల్పించాలని ధర్నా చేపట్టారు.
విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా