కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆముదాలపల్లి శివారులో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని ఠాణాకు తరలించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లు సీజ్ - Telangana news
ఇసుక అక్రమ రవాణా చేస్త చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్