కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమ్మక్క-సారక్క జాతర ఘనంగా సాగుతోంది. భక్తులు అమ్మవార్లకు మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు స్నానమాచరించటానికి ప్రత్యేకంగా ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని వదిలి కుళాయి ఏర్పాటు చేశారు. భద్రత పరంగా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం గస్తీ కాస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో రేకుర్తి సమ్మక్క-సారక్క జాతర - రేకుర్తిలో సమ్మక్క-సారక్క జాతర
మిని మేడారంగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా రేకుర్తి సమ్మక్క-సారక్క జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతోంది. అమ్మవార్లు గద్దెనెక్కడం వల్ల అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తిశ్రద్ధలతో రేకుర్తి సమ్మక్క-సారక్క జాతర