ఆర్టీసీలో ప్రయాణికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యతనిస్తామని విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ గంగారెడ్డి అన్నారు. లాక్డౌన్ అనంతరం ప్రయాణికుల ప్రయాణానికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై కరీంనగర్‌లోని ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే అత్యంత భద్రతా రవాణా సదుపాయం గల సంస్థగా ఆర్టీసీకి గుర్తింపు ఉందని ఆయన వివరించారు.
'ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యం' - కరీంనగర్లో విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ సమీక్ష
దేశంలోనే అత్యంత భద్రతా రవాణా సదుపాయం గల సంస్థగా ఆర్టీసీకి గుర్తింపు ఉందని విజిలెన్స్ జాయింట్ డైరైక్టర్ గంగారెడ్డి అన్నారు. ఈ మేరకు లాక్డౌన్ అనంతరం ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై కరీంనగర్‌లోని ఆర్టీసీ అధికారులతో గంగారెడ్డి సమీక్షించారు.
'ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యం'
సర్వీసులోకి తీసుకునేముందు ప్రతి డ్రైవర్‌కి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని గంగారెడ్డి పేర్కొన్నారు. విధుల్లోకి చేరేముందు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా, రోడ్డు ప్రమాదాలకు పాల్పడిన చరిత్ర ఉందా లాంటి తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి విధులు అప్పగిస్తామని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి సర్వీసులోని కండక్టర్ వద్ద శానిటైజర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు గంగారెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:బల్దియా పోటీకి ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు?