ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు - ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు
ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల ఒత్తిడిని నిరసిస్తూ కరీంనగర్-2 డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చేపట్టారు.
ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు
కరీంనగర్-2 డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నాకు దిగారు. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడికి నిరసన తెలిపారు. డిపో మేనేజర్ మహిళా ఉద్యోగులను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఆరోపించారు. మేనేజర్ వైఖరిని మార్చుకోవాలని.. లేకపోతే ఈ నెల 13న రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. గంట పాటు డిపోలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.