మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఐకాస నాయకులు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్‌కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ ఆస్తులు కాపాడడంలో భాగంగా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారని కరీంనగర్ నాయకుడు కేవీఆర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. స్పందించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్టాండ్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికుల వినతి - RTC STRIKE IN TELANGANA NEWS
తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్‌కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.
న్యాయం జరుగుతుందని..
ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య