ప్రస్తుతం నెలకొన్న గడ్డు తరుణంలో సేవా దృక్పథంతో... అన్నార్తుల ఆకలి తీర్చటం అందరి బాధ్యతని ఆరెస్సెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి తెలిపారు. ఆరెస్సెస్, సేవా భారతి శాఖల ఆధ్వర్యంలో ఆరెపల్లిలో నివసిస్తున్న వలస కూలీల కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'అన్నార్తుల ఆకలి తీర్చి అండగా ఉందాం'
నిరుపేదల ఆకలి తీర్చే మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆరెస్సెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమణాచారి తెలిపారు. ఆరెపల్లిలోని వలస కూలీల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'అన్నార్తుల ఆకలి తీర్చి అండగా ఉందాం'
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు ప్రబలుతున్న కరోనా మహమ్మారిని దేశం కట్టడి చేయగల్గటానికి కారణం ప్రజల సామాజిక స్వీయ నియంత్రణేనని రమణాచారి వ్యాఖ్యానించారు. పలు స్వచ్ఛంత సంస్థలు, సామాజిక సంస్థల సహకారంతో కార్మికవాడలు, బస్తీలు, మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల నిరుపేదల ఆకలి తీర్చుతున్నామని వివరించారు. ఈ మహాయజ్ఞంలో లక్షలాది మంది సేవాతత్పరులైన కార్యకర్తలు పాలు పంచుకుంటున్నారని డాక్టర్ రమణాచారి తెలిపారు.