కరీంనగర్ బస్టాండ్ నుంచి కమాన్ రోడ్డును విస్తరించే కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. రహదారుల విస్తరణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నప్పటికీ.. చాలా రోజులుగా పనులు ప్రారంభం కాలేదని మంత్రి తెలిపారు. రోడ్డుకు ఆటంకంగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు స్థానికులు అంగీకరించడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లేందుకు వినియోగించే రోడ్డుపై ట్రాఫిక్ అధికంగా ఉంటుందని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల చాలా రోజులుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో నిర్మించిన 14 కిలోమీటర్ల పనుల ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా.. ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని గంగుల వివరించారు.
రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన - కరీంనగర్లో రోడ్డు విస్తరణ
కరీంనగర్లో రోడ్డు విస్తరణ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని వివరించారు.
రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన