కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన పడాల రాజేశం(65) తన ద్విచక్రవాహనంపై పని నిమిత్తం శనివారం సాయంత్రం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లికి వెళ్లాడు. గుండ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి - latest road accidents
ఇసుక లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
తీవ్ర గాయాలపాలైన రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి:సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు: భట్టి