తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి రెండుచోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు: రేవంత్‌రెడ్డి

Revanth Reddy Election Campaign in Telangana : తెలంగాణలో పూర్తిస్థాయిలో మార్పు రావాలంటే కాంగ్రెస్​ రావాలని.. కాంగ్రెస్​ వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని జమ్మికుంట, మానుకొండూర్​ నియోజకవర్గాల్లో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరి సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

congress
Revanth Reddy Election Campaign in Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 6:45 PM IST

Revanth Reddy Election Campaign in Telangana :గజ్వేల్​ ప్రజలను మోసం చేసి కేసీఆర్​ కామారెడ్డికి పారిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) విమర్శలు చేశారు. అక్కడ కూడా ప్రజలు సీఎం కేసీఆర్​ను బొందపెట్టడం ఖాయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ(Six Guarantees)లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని జమ్మికుంట, మానుకొండూర్​ నియోజకవర్గాల్లో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరి సభల్లో రేవంత్​ రెడ్డి పాల్గొని.. బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మీ కోరిక నెరవేరాలన్న.. కాంగ్రెస్​ అధికారంలోకి రావాలన్న డిసెంబరు 9 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలని జమ్మికుంటలోని ఓటర్లను రేవంత్​రెడ్డి కోరారు. హుజూరాబాద్​ గడ్డ మీద కాంగ్రెస్​ పార్టీ జెండా ఎగురవేయాలనే నాతో పాటు కోదండరామ్, బల్మూరి వెంకట్​ వచ్చారు. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు.. రాజరికపు పాలన ఉండాలా వద్దా అనే అంశాన్ని తేల్చనున్న ఎన్నికలు అని అన్నారు.

దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్​రెడ్డి

Telangana Election 2023 : ఈ ప్రాంతంలో కోవర్టు నాయకులు ఎక్కువ.. కేసీఆర్(KCR)​తో యుద్ధం చేసి గెలిచిన ఈటల రాజేందర్..​ కేంద్రం ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తెచ్చారా అంటూ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ​ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ పదవి కోసం కమిషన్​ల కోసం పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. వారిద్దరినీ చూశారు కదా.. ఒక్కసారి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్​ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే.. గతంలో ఎలా అభివృద్ధి జరిగిందో అలానే తాను దగ్గరుండి ఈ ప్రాంత అభివృద్ధికి పట్టం కడతానని రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని.. వారంతా ఈ కురుక్షేత్రంలో కేసీఆర్​ ప్రభుత్వాన్ని బొంద పెట్టారని అన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయిలో మార్పు రావాలంటే.. దొరల పాలన పోవాలని సూచించారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. మార్పు రావాలంటే.. కాంగ్రెస్​ రావాలని కోరారు.

కామారెడ్డి ప్రజలు కేసీఆర్​ను బొందపెట్టడం ఖాయం :ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకురాలు సోనియా గాంధీ.. ఆనాడు సిద్దిపేటకే పరిమితమైన కేసీఆర్​.. కరీంనగర్​, పాలమూరు, గజ్వేల్​కు చేరారని మానుకొండూర్​ నియోజకవర్గంలో జరిగిన సభలో రేవంత్​రెడ్డి విమర్శించారు. ఇప్పుడు గజ్వేల్​ ప్రజలను కూడా మోసం చేసి కామారెడ్డి(Kamareddy Fight)కి పారిపోయారని దుయ్యబట్టారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్​ను బొందపెట్టడం ఖాయమని అన్నారు. రసమయి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. తెలంగాణ పాటను రసమయి దొర గడీలో తాకట్టు పెట్టిండు. కేసీఆర్​ నకిలీ వంద రూపాయల నోటు లాంటివాడని.. నకిలీ నోటు జేబులో ఉన్నా దానికి విలువ ఉండని ఎద్దేవా చేశారు.

Congress Vijaya Bheri Sabha at Manukonduru :మానుకొండూర్​లో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ప్రతీ మండలంలో జూనియర్​ కాలేజీ, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అలాగే తోటపల్లి రిజర్వాయర్​ ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మీ ఆలోచనలు, అవసరాలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్​ మంచి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ వేదిక నుంచి కేసీఆర్​కు చెబుతున్నా.. బరాబర్​ దొరల రాజ్యాన్ని బొంద పెడతాం.. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. మానుకొండూర్​లో కవ్వంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించండి.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అంటూ రేవంత్​రెడ్డి వివరణ ఇచ్చారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం : విజయశాంతి

చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ ఆగమవుతోంది : అంజన్ కుమార్ యాదవ్

ABOUT THE AUTHOR

...view details