Retired Teachers Free Education Karimnagar : కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. అందులో తొలుత ఉర్దూ మీడియం, ఆ తర్వాత తెలుగు, ఇటీవల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉన్న పాఠశాలలో సదుపాయాల లేమి వెంటాడుతుండగా మరోవైపు ఉపాధ్యాయుల కొరత ఇబ్బందులకు గురిచేస్తోంది. సదుపాయాలు లేకపోవడంతో ఉర్దూ మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగుతోంది. సదుపాయాల లేమిని లెక్క చేయకుండా అందులో పాఠాలను మాత్రం ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నారు.
అసలే ఉర్దూ మీడియం పాఠశాలల కొరత ఉండగా, అందులో నియామకాలు కూడా అంతంత మాత్రం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉపాధ్యాయులు 2018లో పదవీ విరమణ చేశారు. అయితే తాము పదవీ విరమణ చేస్తే విద్యార్థినుల పరిస్థితి ఏంటని ఆలోచించారు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు. తాము ఇంట్లో కూర్చొని సమయం వృధా చేసే కంటే పిల్లలకు పాఠాలు బోధించడం మేలని భావించారు. తాము పదవీ విరమణ చేశామనే విషయాన్ని మరిచి ప్రతిరోజు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
'నేను వ్యాయాయ ఉపాధ్యాయుడిని. ఇక్కడికి నేను 2011లో వచ్చాను. 2018లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. రెండు సంవత్సరాలు పీఈటీ పోస్ట్‌లో ఉన్నాను. తర్వాత పిల్లలకు హిందీ, తెలుగు బోధించడం జరుగుతుంది. పిల్లల ఉన్నతమైన భవిష్యత్ కోసం రిటైర్డ్ అయినా నా సేవలను వారికి అందిస్తున్నాను. అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పదని గ్రహించి ఇలా రోజు వచ్చి పాఠాలు చెబుతున్నాను.' - రవూఫ్ అంజద్, విశ్రాంత ఉపాధ్యాయుడు
Foreign Education: 'స్టడీ ఇండియా పేరుతో విదేశీ విద్యను అభ్యసించే వారికి రుణాలు'