కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవికుమార్ క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని తెలిపారు.
అంబేడ్కర్ కృషి ఫలితమే రిజర్వేషన్లు : సుంకె రవికుమార్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నివాళులర్పించారు. ఆయన కృషి ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు.
అంబేడ్కర్ కృషి ఫలితమే రిజర్వేషన్లు : సుంకె రవికుమార్
అంబేడ్కర్ కృషి ఫలితంగానే దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గంగాధర మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 82 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, పురపాలక ఛైర్మన్ గుర్రం నీరజ పాల్గొన్నారు.