కరీంనగర్ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు జరిగింది. వానాకాలంలో సాగు చేయాల్సిన పంటలపై చర్చించారు. అకాల వర్షాల వల్ల ఎండాకాలంలో పంట నష్టం ఎక్కువగా ఉంటున్నందున... సాగును రెండు నెలలు ముందుకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గోదావరి జలాలతో జిల్లాలోని ప్రతి చెరువు నింపాలని అధికారులకు సూచించారు. సదస్సులో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏ పంట సూచిస్తే ఆ పంట వేస్తాం: గంగుల - కరీంనగర్ తాజా వార్తలు
అకాల వర్షాలకు ఎండాకాలంలో పంటనష్టం ఎక్కువ స్థాయిలో ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగువిధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలోని అన్ని చెరువులను గుర్తించడం జరిగింది. గోదావరి జలాలు చెరువులకు చేర్చడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్రంలో అధికంగా దొడ్డు రకం ధాన్యం పండిస్తున్నాం. సన్నబియ్యం దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్లనే నియంత్రిత వ్యవసాయ విధానం చేపట్టాలని ముఖ్యమంత్రి ఉద్దేశం. గతంలో ఎన్నడూ లేని విధంగా 46రోజుల్లో 53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో ఏ పంటను వేయాలని సూచిస్తే ఆ పంటను పండిచేందుకు సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తున్నాం.-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి