భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అధ్యక్ష పదవి కోసం పది మంది పోటీ పడ్డారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి, సంకినేని వెంకటేశ్వర్లు, యెండల లక్ష్మీనారాయణ, చింతల రాంచంద్రారెడ్డి... అధ్యక్ష పదవి తమకు కట్టబెట్టాలని దరఖాస్తు చేసుకున్నారు.
ఆర్ఎస్ఎస్ మద్దతు
జాతీయ స్థాయిలో డీకే.అరుణ, జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయతించారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి అవకాశం లేదని జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ సీనియర్ నేతలతోపాటు కిషన్ రెడ్డి, మురళీధర్ రావు... లక్ష్మణ్ వైపే మొగ్గు చూపారు. ఆర్ఎస్ఎస్ మాత్రం సంజయ్‌కి ఇవ్వాలని కోరింది.
పనితీరు మెప్పించింది
లక్ష్మణ్ తర్వాత పార్టీలో సంజయ్‌కి మంచి గుర్తింపు ఉండటం.. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్లో చేరి ఏబీవీపీ, యువ మోర్చా, భాజపాలో వివిధ హోదాల్లో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తీరును జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది.