Rare Rats: కుందేళ్ల మాదిరిగా ముచ్చటగా కనిపిస్తున్న ఈ ప్రాణుల్ని గినియా పిగ్స్ అంటారు. కరీంనగర్‌లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు. విభిన్న వర్ణాల్లో ఉండటంతో ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్(జువాలజీ) ఎన్.సంగీతారాణి వీటి గురించి వివరించారు. గినియా పిగ్స్ 16వ శతాబ్దం నుంచీ కనబడుతున్నాయన్నారు. ఇవి కావిడే కుటుంబంలోని కేవియా జాతికి చెందిన ఎలుకలని, మూడు నెలలకు ఒక ఈత చొప్పున సంతానాన్ని వృద్ధి చేస్తాయని వివరించారు. ఇవి శాకాహారులని, తోకలుండవని వీటిని దక్షిణ అమెరికాలో ఇళ్లలో పెంచుకుంటారని ఆమె తెలిపారు.
Rare Rats: ఇవి కుందేళ్లు కాదండోయ్.... ఎలుకలే..!! - Rats looking like rabbits
Rare Rats: ఈ చిత్రంలో కనిపిస్తున్న కుందేళ్లు భలే ఉన్నాయి కదా.. ముద్దుముద్దుగా రంగురంగుల్లో ఉన్న వీటిని చూస్తుంటే.. చేతుల్లోకి తీసుకొని ఆడించాలని అనిపిస్తుంటుంది కదా.. అలా అని పొరపాటున వీటిని చేతుల్లోకి తీసుకున్నారే అనుకోండి.. మిమ్మల్ని కరవడం ఖాయం. అదేంటి కుందేళ్లు కరుస్తాయా అని మీకు సందేహం రావొచ్చు.. అవునండీ కరుస్తాయి.. ఎందుకంటే ఇవి కుందేళ్లు కాదు.. వాటిలా ఉన్న ఎలుకలు.. వీటికి ఉన్న మరో విశిష్టత ఏంటంటే.. వీటికి తోకలు లేవు.
కుందేళ్ల మాదిరి ఎలుకలు