కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన కొప్పుల సాయి కుమార్ మూడు రోజుల క్రితం గోపాల్రావుపల్లి గ్రామ శివారులోని బావిలో పడి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ చూడకపోవడం వల్ల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గోపాల్రావుపల్లి గ్రామ శివారులో తన మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు.
గోపాల్రావుపల్లిలో యువకుని మృతికి నిరసనగా బంధువుల రాస్తారోకో - Rasta Roko of relatives of death case of Gopal Rao Palli
కరీంనగర్ జిల్లా గోపాల్రావుపల్లిలో ఓ యువకుని మృతికి పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ - జగిత్యాల రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

ఆ సమయంలో అక్కడ వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దానితో ఆ ప్రాంతం నుంచి అందరూ పరిగెత్తారు. అదే సమయంలో కొప్పుల సాయి కుమార్ పరిగెత్తి బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల వేధింపుల వల్లే సాయి కుమార్ మృతి చెందినట్టు ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు రాస్తారోకో చేశారు. దీంతో కొంత సమయంపాటు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చివరికి గ్రామీణ ఏసీపీ విజయ సారథి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్
TAGGED:
గంగాధర గ్రామస్థుల రాస్తారోకో