దేశంలోని అన్ని రాష్ట్రాల పౌర సరఫాల శాఖ మంత్రులతో వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న నిత్యావసర వస్తువుల కొరత, పలు అంశాలపై కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రం తరఫున మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
గన్నీ సంచుల కొరత తీర్చండి: మంత్రి గంగుల - గన్నీ సంచుల కొరత తీర్చండి: మంత్రి గంగుల
రబీ ధాన్యం కొనుగోలు కోసం గన్నీ సంచుల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌ను కోరారు.

గన్నీ సంచుల కొరత తీర్చండి: మంత్రి గంగుల
రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత, రేషన్ బియ్యం పంపిణీ వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన హమాలీలు ఇక్కడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.